రేపు కుటుంబ సభ్యులతో డిపోల ముందు ప్రదర్శన... భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ
- తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
- 16వ రోజుకు చేరిన సమ్మె
- సమ్మె మరింత ఉద్ధృతం చేయాలని జేఏసీ నిర్ణయం
అనంతరం ఈ నెల 24న మహిళా కండక్టర్లతో దీక్షలు, 25న హైవేల దిగ్బంధనం, రాస్తారోకోలు నిర్వహించనున్నారు. ఈ నెల 26న ఆర్టీసీ కార్మికుల పిల్లలతో డిపోల వద్ద దీక్షలు చేపట్టాలని నిశ్చయించారు. పండుగకు జీతాలు లేకపోవడంతో ఈ నెల 27న దీపావళి సందర్భంగా నిరసన చేపడతారు. ఈ నెల 30న 5 లక్షల మందితో సకల జనుల సమరభేరి కార్యక్రమం ఉంటుంది.