టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అరెస్ట్
Add ap7am to your home Screen

టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అరెస్ట్

  • సుందరయ్య పార్కు వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రాజిరెడ్డి, వెంకన్న కూడా అరెస్ట్
  • రాష్ట్ర సర్కారు మొండి వైఖరిని వీడాలన్న అశ్వత్థామరెడ్డి
తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. సుందరయ్య పార్కు వద్ద నిరసనలో పాల్గొంటున్న టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డితో పాటు ఆర్టీసీ నేతలు రాజిరెడ్డి, వెంకన్నలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర సర్కారు తన మొండి వైఖరిని వీడాలని ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి అన్నారు. తాము తలపెట్టిన సమ్మెను కొనసాగించి, దీన్ని విజయవంతం చేయాలని ఆయన కార్మికులకు సూచించారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా బస్సు డిపోల వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ రోజు బైక్ ర్యాలీలు నిర్వహించారు. రేపు ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నుంచి బంద్ కు మద్దతు వచ్చింది. బంద్ ను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
tsrtc
Telangana
Hyderabad

More Telugu News