'ఒక్క పెగ్గే' కదా అని తాగేస్తే గుండెకు ఇబ్బందే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఒక్క పెగ్గే' కదా అని తాగేస్తే గుండెకు ఇబ్బందే!

  • సుమారు కోటి మందిపై అధ్యయనం
  • గుండె కొట్టుకొనే వేగంలో మార్పులు 
  • గుండెపోటుకు గురయ్యే ప్రమాదం 
ప్రతి రోజు తాగేది ఒక్క పెగ్గే కదా? అని సర్దిచెప్పుకుంటూ మందు తాగితే.. మీ గుండెకు ముప్పేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 'కొంచెం తాగితే ఏమీ కాదులే.. అయినా కొద్దిగా తాగితే ఆరోగ్యానికి మంచిదే' అని కొందరు భావిస్తారు. తాగుడుకి బానిసైన వారంతా ఆ ఒక్క పెగ్గుతో మొదలు పెట్టినవారే. అయితే, మద్యాన్ని బాగా తాగేవారిలాగే, తక్కువ మోతాదులో ఆల్కహాల్ ని తరుచూ తాగేవారు కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదట.

మద్యం కొద్దికొద్దిగా పదే పదే తాగితే గుండెకు ముప్పని పరిశోధకులు తేల్చారు. సుమారు కోటి మందిపై ఎనిమిది సంవత్సరాల పాటు జరిపిన ఓ అధ్యయనం ఫలితంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా తాగుతున్నప్పుడల్లా గుండె కొట్టుకొనే వేగంలో మార్పులు వస్తాయని తెలిపారు. దీంతో గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని తేల్చారు.
health
heart

More Telugu News