హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం... భారీ వర్షం!
Add ap7am to your home Screen

హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం... భారీ వర్షం!

  • మధ్యాహ్నం తర్వాత పలు ప్రాంతాల్లో కుంభవృష్టి
  • రహదారులు జలమయం
  • ట్రాఫిక్ కు అంతరాయం
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం మరోసారి ముంచెత్తింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. నగరంలో మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. కారుమబ్బులు కమ్ముకుని ఏకధాటిగా కుమ్మేశాయి. చూస్తుండగానే రహదారులు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువులను తలపించాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
Hyderabad
Rain
Telangana

More Telugu News