నేటి సాయంత్రం వీవీ వినాయక్ హీరోగా నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్
Add ap7am to your home Screen

నేటి సాయంత్రం వీవీ వినాయక్ హీరోగా నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్

  • వినాయక్ ప్రధానపాత్రలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రం
  • దర్శకుడిగా ఎన్.నరసింహ
  • ఠాగూర్ లో చిన్న పాత్ర పోషించిన వినాయక్
ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ కొంతకాలంగా డైరెక్షన్ రేసులో వెనుకబడ్డారు. అయితే, ఆయనను నటుడిగా పరిచయం చేయాలని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్ణయించుకున్నారు. తమ తదుపరి చిత్రంలో వీవీ వినాయక్ ప్రధానపాత్ర పోషిస్తున్నారని, ఈ చిత్రానికి ఎన్.నరసింహ దర్శకత్వం వహిస్తాడని దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దసరా సందర్భంగా ప్రకటించింది. వీవీ వినాయక్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సాయంత్రం 5 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నామని ట్వీట్ చేసింది.

వీవీ వినాయక్ లో మంచి నటుడు ఉన్నాడని ఇండస్ట్రీ ఎప్పుడో గుర్తించింది. ఠాగూర్ చిత్రంలో ఆయన ఓ చిన్నపాత్ర పోషించినా, తనలోనూ ఓ నటుడు ఉన్నాడని చాటుకున్నారు. మరి, నటుడిగా కొత్త ఇన్నింగ్స్ ఎలా సాగుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఇక, వినాయక్ ను లీడ్ రోల్ లో పరిచయం చేస్తున్న చిత్రానికి దర్శకత్వం వహించే చాన్స్ దక్కించుకున్న ఎన్.నరసింహ గతంలో దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్ వద్ద శిష్యరికం చేశాడు.
VV Vinayak
Dil Raju
Tollywood

More Telugu News