ఎల్గార్, డికాక్ సెంచరీలు చేసినా అశ్విన్ తిప్పేశాడు!
- అశ్విన్ కు 5 వికెట్లు
- తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగులు వెనుకబడిన దక్షిణాఫ్రికా
- మూడోరోజు సఫారీల స్కోరు 8 వికెట్లకు 385 రన్స్
- తొలి ఇన్నింగ్స్ లో భారత్ 502/7 డిక్లేర్డ్
ఓపెనర్ డీన్ ఎల్గార్ (160), వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (111) ల సెంచరీలతో దక్షిణాఫ్రికా భారీస్కోరు దిశగా పయనిస్తున్నట్టే కనిపించింది. కానీ, టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి మ్యాజిక్ చేయడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. అశ్విన్ కు 5 వికెట్లు దక్కాయి. ఇవాళ్టి ఆటలో డుప్లెసిస్ (55), డికాక్ లను అవుట్ చేయడంతోపాటు, ఆల్ రౌండర్ ఫిలాండర్ ను కూడా అశ్విన్ డకౌట్ చేశాడు. అంతకుముందు ఎల్గార్ ను జడేజా పెవిలియన్ కు పంపాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ ను 7 వికెట్లకు 502 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.