హైదరాబాద్ లో భారీ వర్షం... పలు ప్రాంతాలు జలమయం
Add ap7am to your home Screen

హైదరాబాద్ లో భారీ వర్షం... పలు ప్రాంతాలు జలమయం

  • తడిసిముద్దయిన నగరం
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
హైదరాబాద్ నగరాన్ని మరోసారి భారీ వర్షం పలకరించింది! ఈ సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు ప్రవహిస్తుండడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కోఠి, కాచిగూడ, బంజారాహిల్స్, హిమాయత్ నగర్, నారాయణగూడ, అంబర్ పేట, జీడిమెట్ల ప్రాంతాలు జలమయం అయ్యాయి. మారేడ్ పల్లి, సంగీత్, ప్యారడైజ్, బేగంపేట, సికింద్రాబాద్, చిలకలగూడ, సీతాఫల్ మండీ ప్రాంతాలు సైతం తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షం కారణంగా వనస్థలిపురం, హస్తినాపురంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Hyderabad
Rains
Telangana

More Telugu News