మహాత్ముడికి ఇష్టమైన 'వైష్ణవ జన తో' గీతాన్ని 150కి పైగా దేశాల గాయకులు ఆలపించారు: మోదీ
- అహ్మదాబాద్ లో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మోదీ
- జాతిపితకు నివాళులు
- ప్రపంచనేతల గౌరవం పొందారంటూ గాంధీకి కితాబు
భారత్ ఇప్పుడు ప్రపంచశక్తిగా అవతరిస్తోందని, ప్రపంచదేశాలు భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే ప్రపంచదేశాల్లో భారత్ ప్రతిష్ఠ ఎంతో పెరిగిందని మోదీ చెప్పుకొచ్చారు. ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ యోగా దినం ప్రతిపాదన చేస్తే స్వల్ప వ్యవధిలో ఆమోదం లభించిందని వివరించారు.