వెంకీ చేతుల మీదుగా '3 మంకీస్' టీజర్ రిలీజ్
- కామెడీ ప్రధానంగా సాగే '3 మంకీస్'
- బ్యాచిలర్స్ చుట్టూ తిరిగే కథ
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
తాజాగా ఈ సినిమా నుంచి వెంకటేశ్ చేతుల మీదుగా ఒక టీజర్ ను రిలీజ్ చేయించారు. ఈ సినిమాలో ఈ ముగ్గురూ స్నేహితులుగా కనిపించనున్నారనే విషయం ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. మందు పార్టీలు చేసుకునే బ్యాచిలర్స్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా సాగనుంది. షకలక శంకర్ ఓ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఈ ముగ్గురిని ఎంతవరకూ బిజీ చేస్తుందో చూడాలి.