చింతమనేనికి మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చింతమనేనికి మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు

  • ఇప్పటికే ఏలూరు జైల్లో రిమాండ్ లో ఉన్న చింతమనేని
  • ఓ దివ్యాంగుడిపై చేయి చేసుకున్న కేసులో నేడు కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
  • వచ్చే నెల 10 వరకు రిమాండ్ విధించిన కోర్టు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇప్పటికే ఏలూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్నారు. మరో కేసుకు సంబంధించి నేడు పీటీ వారెంట్ పై చింతమనేనిని ఏలూరు జిల్లా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో కోర్టులో ప్రవేశపెట్టారు. 2018లో తన వద్దకు వచ్చిన ఓ దివ్యాంగుడిపై చింతమనేని చేయి చేసుకున్నారనే వార్త అప్పట్లో సంచలనంగా మారింది. ఈ కేసును విచారించిన కోర్టు వచ్చే నెల 10 వరకు ఆయనకు రిమాండ్ విధించింది.
Chinthamaneni Prabhakar
Telugudesam
Remand

More Telugu News