కోడెలను చంద్రబాబు వాడుకుని వదిలేశారు!: విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు
- కోడెల మరణాన్ని బాబు రాజకీయం చేశారు
- ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారు
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
గతంలో తాను కొనుగోలు చేసిన 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కోడెలను వాడుకున్న చంద్రబాబు, ఆ తర్వాత వదిలేశాడని విమర్శించారు. నమ్మినవారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.