నల్గొండలో ఆకాశానికి చిల్లులు పడినట్టుగా కుండపోత వాన... వందేళ్ల రికార్డు బద్దలు
- ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు
- నల్గొండను ముంచెత్తిన వరుణుడు
- 6 గంటల వ్యవధిలో 200 మిమీ వర్షపాతం నమోదు
అప్పట్లో ఇదే రీతిలో వర్షపాతం నమోదైనా ఎక్కువ సమయం తీసుకుంది. తాజాగా, మంగళవారం సాయంత్రం 5 గంటలకు మొదలైన వాన రాత్రి 11 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడమే కాకుండా ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు.