బిగ్ బాస్-3... వైరల్ అవుతున్న రాహుల్, పునర్నవి కిస్ అండ్ హగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్-3... వైరల్ అవుతున్న రాహుల్, పునర్నవి కిస్ అండ్ హగ్!

  • ఇటీవలి కాలంలో ఇద్దరి మధ్యా గొడవలు
  • కలిపేందుకు బిగ్ బాస్ స్పెషల్ టాస్క్
  • 20 గ్లాస్ ల కాకరకాయ జ్యూస్ తాగిన రాహుల్
  • ఆనందం పట్టలేకపోయిన పునర్నవి
ప్రస్తుత సీజన్ టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్ లో మంచి స్నేహితులుగా ఎవరినైనా చెప్పాలంటే, అందులో మొదట ఉండేది రాహుల్ - పునర్నవి జోడీయే. ఇక, వీరిద్దరి మధ్యా గత నాలుగైదు రోజులుగా గొడవలు రాగా, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ తో వీరిద్దరూ కలిసి పోయారు. అది కూడా అలా ఇలా కాదు. వీరి హగ్స్, కిస్ లు ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి.

తన కోసం 20 గ్లాస్ ల కాకరకాయల జ్యూస్ ను రాహుల్ తాగగలడా? అని పునర్నవి వ్యక్తం చేసిన సందేహాన్ని పటాపంచలు చేస్తూ, రాహుల్ విజయవంతంగా టాస్క్ ను పూర్తి చేయగా, పునర్నవి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రాహుల్ ను గట్టిగా హత్తుకుని ముద్దు మీద ముద్దులు పెట్టింది.

కాకరకాయ రసం తాగడమంటే మామూలు విషయం కాదు. అటువంటిది తనను గట్టున పడేసేందుకు రాహుల్ చేసిన పని పునర్నవికి అమితానందాన్ని కలిగించగా, చూస్తున్న వీక్షకులకు ఫుల్ రొమాన్స్ కనిపించింది. ఇక వీరిద్దరి లేటెస్ట్ రొమాన్స్ పై సామాజిక మాధ్యమాల్లో వందల కొద్దీ మీమ్స్ వచ్చాయి. ఈ ఒక్కసీన్ తో రాహుల్ హౌస్ లో హీరో అయిపోయాడని అంటున్నారు.
Bigg Boss
Punarnavi
Rahul
Kiss
Hug

More Telugu News