ఆస్తి కోసం మేనమామ శారీరకంగా వేధిస్తున్నాడు: కన్నడ సినీ నటి జయశ్రీ రామయ్య ఫిర్యాదు
- అర్ధరాత్రి తల్లిని గెంటేశాడు
- నా దుస్తులు బాగాలేవంటూ దూషణలు
- మేనమామకు పోలీసుల విచారణ నోటీసులు
ఈనెల 10న హనుమంత నగర్ లోని తమ నివాసానికి వచ్చిన ఆయన, తన తల్లిని ఇంటి నుంచి గెంటేశాడని, తాను ధరిస్తున్న దుస్తులు అసభ్యంగా ఉన్నాయంటూ తీవ్ర పదజాలంతో దూషించాడని చెప్పింది. జయశ్రీ ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు, విచారణకు హాజరు కావాలంటూ గిరీశ్ కు సూచించారు. ఇద్దరినీ విచారించిన అనంతరం కేసు నమోదు విషయమై ఓ నిర్ణయం తీసుకుంటామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.