Bigg boss: బిగ్ బాస్-3... ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నది వీరే... అందరి టార్గెట్ శిల్ప!

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్, మూడవ సీజన్ లో మరో ఎలిమినేషన్ ఎపిసోడ్ కు నాంది పడింది. ఈ వారం ఎలిమినేట్ అయ్యే వారిలో శిల్పా చక్రవర్తి, హిమజ, శ్రీముఖి, పునర్నవి, మహేశ్ ఉన్నారు. వీరితో పాటు రవి కూడా తొలుత నామినేట్ అయినప్పటికీ, హౌస్ కెప్టెన్ బాబా భాస్కర్ పుణ్యమాని రవి తప్పించుకున్నాడు.

ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యే వారిని ఎంపిక చేసేందుకు సైతం బిగ్ బాస్ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇకపై ఈ ప్రక్రియ క్లిష్టతరంగా ఉంటుందని హెచ్చరించాడు. బాబా భాస్కర్ మినహా మిగిలిన వారిని రెండు భాగాలుగా విభజించి, ఒక్కో సభ్యుడూ, రెండో టీమ్ లోని ఇద్దరిని ఎంపిక చేయాలని సూచించగా, అందరి టార్గెట్ రెండు వారాల క్రితం హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన యాంకర్, నటి శిల్పా చక్రవర్తి టార్గెట్ అయింది.

ఇదే సమయంలో ఎప్పుడూ రాహుల్ ను నామినేట్ చేసే శ్రీముఖి, ఈ దఫా ఆ పని చేయకపోవడం గమనార్హం. ఇదే సమయంలో రాహుల్ మాత్రం ఆమెను వదల్లేదు. మొత్తం మీద ఎనిమిదో వారంలో ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్న వారిలో పునర్నవి లేదా శిల్పా చక్రవర్తి బయటకు వెళ్లి పోవచ్చని అప్పుడే సోషల్ మీడియా కోడై కూస్తోంది.
Bigg boss
Season 3
Eliminations
Nominations

More Telugu News