Sangareddy Murder: ప్రియుడితో వెళ్లిపోయిందని.. భార్య గొంతుకోసి చంపేసిన భర్త

Sangareddy Man Murders Wife Over Affair in Zahirabad
షార్ట్స్‌లో చూడండి
ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను గొంతు కోసి హత్య చేసిన ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చోటు చేసుకుంది. జహీరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి తన భార్య ప్రియుడితో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 30న పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

తన ప్రియుడితో కలిసి ఆమె జడ్చర్లలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జహీరాబాద్‌కు తీసుకువచ్చేందుకు పోలీసులు, భర్త కలిసి వెళ్లారు. ఆమెను తీసుకుని కారులో జడ్చర్ల నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. జడ్చర్ల నుంచి వస్తున్న సమయంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో కారు సదాశివపేట మండలం నందికంది వద్దకు చేరుకున్న సమయంలో భర్త భార్య గొంతు కోసి చంపేశాడు.
Go Back to Shorts
Sangareddy Murder
Telangana Crime
Wife Murder
Extramarital Affair
Zahirabad
Nandikandi
Sadashivpet

More Telugu News