తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేడు.. అసెంబ్లీలో కేసీఆర్.. మండలిలో హరీశ్ రావు!
- ఉదయం 11.30 గంటలకు బడ్జెట్ సమావేశాలు
- శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేసీఆర్.. మండలిలో హరీశ్ రావు
- నేటి సమావేశాలు ముగిసిన వెంటనే బీఏసీ సమావేశం
ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ ఏడాది బడ్జెట్ తగ్గనుంది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 1.81 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సారి ఇది రూ. 1.70 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉంది. లో-ఇరిగేషన్ కు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 22,500 కోట్లు కేటాయించగా... ఈసారి రూ. 20 వేల కోట్లు మాత్రమే కేటాయించే అవకాశం ఉంది.