Hyderabad: ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు

ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి భక్తుల రద్దీ నెలకొంది. క్యూలైన్లలో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఈరోజు సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు. ఖైరతాబాద్ గణేశుని దర్శించుకునేందుకు బయట ప్రాంతాల భక్తులు కూడా ఇక్కడికి వచ్చారు. ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతాలు ట్రాఫిక్ దిగ్బంధంలో ఉన్నాయి.
Hyderabad
Khairatabad
Ganesh
Traffic

More Telugu News