ట్రంప్ కుమార్తెపై వ్యాఖ్యలు... అధ్యక్షుడి పీఏపై వేటు వేసిన వైట్ హౌస్!
Add ap7am to your home Screen

ట్రంప్ కుమార్తెపై వ్యాఖ్యలు... అధ్యక్షుడి పీఏపై వేటు వేసిన వైట్ హౌస్!

  • టిఫానీ ట్రంప్ లావుగా ఉండేదంటూ వ్యాఖ్యానించిన ట్రంప్ పీఏ మ్యాడెలిన్
  • ఆమె ఫొటోను చూసేందుకు కూడా ట్రంప్ ఇష్టపడేవారు కాదంటూ వ్యాఖ్య
  • భవిష్యత్తులో మ్యాడెలిన్ వైట్ హౌస్ లో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ నిషేధాజ్ఞలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ పై వ్యాఖ్యలు చేసిన ఓ అధికారిణి ఉద్యోగం ఊడింది. ఆ అధికారిణి ఎవరో కాదు ట్రంప్ పీఏ మ్యాడెలిన్ వెస్టర్ హౌట్. ఆమె ఇటీవల ఓ పార్టీలో ఇతరులతో మాట్లాడుతూ, ట్రంప్ కుమార్తె టిఫానీ ఊబకాయంతో బాధపడేదని, అందుకే ఆమె ఫొటోలను చూడడానికి కూడా ట్రంప్ ఇష్టపడేవారు కాదని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను వైట్ హౌస్ తీవ్రంగా పరిగణించింది. భవిష్యత్తులో మ్యాడెలిన్ వైట్ హౌస్ లో అడుగుపెట్టరాదని స్పష్టం చేసింది. అధ్యక్ష కార్యాలయానికి సంబంధించిన సమాచారం లీక్ చేసిందంటూ ఆమెపై ఆరోపణలు మోపింది.

దీనిపై ట్రంప్ స్పందించారు. తాను ఆమెతో మాట్లాడానని, ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని మ్యాడెలిన్ ఎంతో బాధపడుతున్నారని, ఆమె మద్యం సేవించి మాట్లాడినట్టు తెలిపారని ట్రంప్ వివరించారు. తనకు కుమార్తెలంటే చాలా ఇష్టమని, ఇలాంటి ఆరోపణలను తాను అంగీకరించనని స్పష్టం చేశారు. మొదటినుంచి ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలిగా వ్యవహరిస్తున్న మ్యాడెలిన్ పనితీరుపై ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. ట్రంప్ కూడా ఎన్నోసార్లు తన పీఏ గురించి ప్రశంసించేవారు. అలాంటిది, ఉన్నట్టుండి ఆమెపై వేటు వేయడంతో విపక్షాలతో పాటు సొంత పార్టీలోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
Donald Trump
Madeline
White House

More Telugu News