ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో రాహుల్ గాంధీని వాడుకున్న పాకిస్థాన్.. లేఖలో ఏముందంటే..!
- జమ్మూ కశ్మీర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి
- రాహుల్ గాంధీ కూడా ఇదే చెప్పారు
- జమ్మూ కశ్మీర్ లో ప్రజలు చనిపోతున్నారని చెప్పారు
"జమ్మూ కశ్మీర్ లో ఎన్నో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భారత్ కు చెందిన కీలక రాజకీయ నాయకులు కూడా ఇదే చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్ లో ప్రజలు చనిపోతున్నారని, పరిస్థితులు హింసాత్మకంగా మారుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పారు." అని లేఖలో పాకిస్థాన్ పేర్కొంది. జమ్మూ కశ్మీర్ లోని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాల పేర్లను కూడా లేఖలో ఉటంకించింది. మరోవైపు రాహుల్ గాంధీని ప్రస్తావించడంతో పాకిస్థాన్ పై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.