వెస్టిండీస్ 222 ఆలౌట్... టీమిండియాకు 75 పరుగుల ఆధిక్యం
- నార్త్ సౌండ్ లో తొలి టెస్టు
- మొదటి ఇన్నింగ్స్ లో 297 పరుగులు చేసిన భారత్
- తొలి ఇన్నింగ్స్ లో వెనుకబడిపోయిన విండీస్
- ఇషాంత్ శర్మకు 5 వికెట్లు
ఇషాంత్ కు తోడు షమీ, జడేజా కూడా చెరో 2 వికెట్లతో రాణించడంతో విండీస్ తక్కువ స్కోరుకు పరిమితమైంది. ఆ జట్టులో రోస్టన్ చేజ్ 48 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హోల్డర్ 39, హెట్మెయర్ 35 పరుగులు సాధించారు. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నారు.