సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హాలిడే తీసుకున్న రకుల్ 
  • షార్ట్ ఫిలింలో నటించనున్న జాన్వి
  • రాహుల్ రవీంద్రన్ మరో చిత్రం
*  గత కొన్నాళ్లుగా ఇటు తెలుగు, అటు హిందీ సినిమాల షూటింగ్ తో బిజీగా వున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు హాలిడే తీసుకుంది. కుటుంబ సభ్యులతో కలసి గడపడానికి స్పెయిన్ దేశానికి వెళ్ళింది. అక్కడి నుంచి రాగానే భారతీయుడు సీక్వెల్ షూటింగులో పాల్గొంటుంది.
*  గత సంవత్సరం 'దఢక్' చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇప్పుడు రెండు మూడు సినిమాలతో బిజీగా వుంది. మరోపక్క తాజాగా నెట్ ఫ్లిక్స్ నిర్మించే షార్ట్ ఫిలింలో నటించడానికి కూడా ఓకే చెప్పింది. జోయా అక్తర్ దీనికి దర్శకత్వం వహిస్తాడు.
*  తాజాగా నాగార్జునతో 'మన్మథుడు 2' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలో ఈ చిత్రాన్ని చేయనున్నాడు.
Rakul
Johnvi Kapoor
Nagarjuna
Rahul

More Telugu News