జేఎన్యూ విద్యార్థి నేత షెహ్లా రషీద్ పై ఫిర్యాదు చేసిన సుప్రీం కోర్టు న్యాయవాది
- కశ్మీర్ లో కల్లోలం అంటూ షెహ్లా వ్యాఖ్యలు
- షెహ్లాను అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదు చేసిన సుప్రీం న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ
- భారత ప్రభుత్వంపైనా, సైన్యంపైనా నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తోందంటూ ఆరోపణ
మరోవైపు భారత సైన్యం కూడా షెహ్లా ఆరోపణలను 'అభూత కల్పనలు' అంటూ కొట్టిపారేసింది. అంతకుముందు షెహ్లా, సైనికులు కశ్మీరీల ఇళ్లలోకి వెళ్లి మరీ యువకులను బయటికి ఈడ్చుకువస్తున్నారని, ఇప్పుడక్కడ ఏదీ ప్రజల పక్షాన జరగడంలేదని తీవ్ర ఆందోళనకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసింది.