కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఓడిపోవడం వెనుక నా పాత్ర ఉంది: బాబుమోహన్
- పాలన చేతకాకే బీజేపీని టీఆర్ఎస్ విమర్శిస్తోంది
- కూల్చడం తప్ప కేసీఆర్ కు మరేమీ తెలియదు
- నాకు పదవులు ముఖ్యం కాదు
రాజకీయాల్లో అవుట్ డేట్ కావడం ఉండదని... ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్, కేటీఆర్ ఔట్ డేట్ అవుతారా? అని బాబు మోహన్ ప్రశ్నించారు. తనకు పదవులు ముఖ్యం కాదని... పార్టీ ఏ పని అప్పజెప్పినా కష్టపడి పని చేస్తానని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఓడిపోవడం వెనుక తన పాత్ర ఉందని తెలిపారు.