బిగ్ బాస్-3... నేడు రోహిణి ఎలిమినేట్!
Add ap7am to your home Screen

బిగ్ బాస్-3... నేడు రోహిణి ఎలిమినేట్!

  • బయటకు వెళ్లేది ఎవరో తేల్చేసిన సోషల్ మీడియా
  • ముందే లీకైపోతున్న పేర్లు
  • నేటి రాత్రి ప్రసారం కానున్న ఎపిసోడ్
టాలీవుడ్ బుల్లితెర అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ -3లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో సోషల్ మీడియా తేల్చేసింది. నేడు హౌస్ నుంచి రోహిణి బయటకు రానుందట. ఎలిమినేషన్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఒకటి, రెండు రోజులు ముందుగానే చిత్రీకరిస్తుండటంతో, ప్రతివారమూ ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తున్నారన్న విషయం ముందుగానే లీకై పోతున్న సంగతి తెలిసిందే.

ఇక, ఈ వారంలో కిచెన్‌ లో గొడవ, వితికా, వరుణ్ మధ్య గుసగుసలు, రవికృష్ణ, అషూల మధ్య సంభాషణ, పునర్నవి, రాహుల్‌ల చర్చలు హైలెట్ గా నిలిచాయి. ఈ వారం శివజ్యోతి, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్‌, రోహిణి ఎలిమినేషన్ జోన్ లో ఉండగా, శివజ్యోతి, వరుణ్‌ సందేశ్‌ సేఫ్ జోన్ లోకి వచ్చేసినట్టు నిన్న రాత్రి ఎపిసోడ్ లో నాగ్ ప్రకటించేశారు. ఇక నేడు బయటకు ఎవరు వెళతారో తెలియాలంటే రాత్రి వరకూ ఆగాల్సిందే.
Biggboss
Rohini
Eliminate

More Telugu News