నా ఫ్రెండ్ మోదీ, భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ
- నమస్తే అంటూ శుభాకాంక్షలు చెప్పిన నెతన్యాహూ
- భారత్-ఇజ్రాయెల్ బంధం సరికొత్త ఎత్తుకు చేరుకుందని వ్యాఖ్య
- ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్-ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత ఉన్నతస్థితికి చేరుకున్నాయని తెలిపారు. ఇరుదేశాల మధ్య ఉన్నది సహకారం మాత్రమే కాదనీ, నిజమైన స్నేహమని వ్యాఖ్యానించారు.