కర్ణాటకలో భారీ వర్షాలు.. ఇంటిపైకి చేరి సేదదీరుతున్న మొసలి.. వీడియో ఇదిగో!
- బెల్గామ్ లోని రేబక్ ప్రాంతంలో ఘటన
- ఉప్పొంగిన వరదనీరు.. ఇంటిపైకి మొసలి
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
మరోవైపు వరద నీరు ఉప్పొంగడంతో ఉభయచరాలు ఎత్తైన ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. తాజాగా బెల్గామ్ లోని రేబక్ ప్రాంతంలో భారీగా వరద నీరు చేరుకోవడంతో ఓ మొసలి ఏటూ వెళ్లలేకపోయింది. దీంతో అక్కడే ఉన్న ఇంటి పైకప్పు పైకి చేరుకుని సేదతీరడం ప్రారంభించింది. దీన్ని ఓ వ్యక్తి ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది. ఎడతెరిపిలేని వర్షాలకు కర్ణాటకలో ఇప్పటివరకూ 31 మంది ప్రాణాలు కోల్పోయారు.