వెంటిలేటర్ పై అరుణ్ జైట్లీ... ఎయిమ్స్ కు వెళ్లిన వెంకయ్యనాయుడు
- ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న జైట్లీ
- ఉదయం 7.30 గంటలకు ఆసుపత్రికి వెళ్లిన వెంకయ్యనాయుడు
- జైట్లీ ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
వివిధ విభాగాలకు సంబంధించిన ఓ వైద్యుల బృందం అరుణ్ జైట్లీకి చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. మరోవైపు, నిన్ననే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆసుపత్రిని సందర్శించారు. అనారోగ్య కారణాల వల్ల గత ఎన్నికల్లో అరుణ్ జైట్లీ పోటీ చేయలేదు. ఎన్నికలకు ముందు అమెరికాలో కూడా చికిత్స చేయించుకున్నారు.