ఢిల్లీలో బీజేపీ నేతలతో సుమలత డిన్నర్ మీటింగ్... అవసరమా? అంటూ నెటిజన్ల కామెంట్లు!
- సుష్మా స్వరాజ్ మరణించిన సమయంలో ఈ ట్వీట్లేంటి?
- సుమలత ట్వీట్ పై బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహం
- తప్పును సరిదిద్దుకుంటూ సంతాప కామెంట్
బీజేపీ శ్రేణులంతా ఆవేదనలో ఉన్న సమయంలో, ఢిల్లీలోని కర్ణాటక భవనంలో ముఖ్యమంత్రి యడియూరప్ప, కేంద్ర మంత్రులు డీవీ సదానందగౌడ తదితరులతో డిన్నర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఫోటోను అర్ధరాత్రి 12:18 గంటల సమయంలో సుమలత అప్ లోడ్ చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తల్లో ఆగ్రహం పెల్లుబికింది. సుష్మా స్వరాజ్ మృతి చెందిన సమయంలో ఆమెను జ్ఞాపకం చేసుకోకుండా ఈ తరహా డిన్నర్ మీటింగ్ ల ట్వీట్లు, ఫోటోలు పెట్టడం అవసరమా? అంటూ తిట్లకు దిగారు. దీంతో తన తప్పును తెలుసుకున్న ఆమె, సుష్మా స్వరాజ్ మరణం దేశానికి తీరని లోటని అంటూ మరో ట్వీట్ చేయడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది.