అప్పంతా నయాపైసా సహా చెల్లిస్తా: విజయ్ మాల్యా

  • వందశాతం బ్యాంకులకు కట్టేస్తా
  • ఆర్థిక మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన మాల్యా
  • ఇండియాకు రప్పించేందుకు సీబీఐ, ఈడీ కృషి
ఇండియాలోని బ్యాంకుల నుంచి తాను తీసుకున్న అప్పులన్నీ తిరిగి చెల్లించేస్తానని యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా ప్రకటించారు. తీసుకున్న రుణాన్ని వందశాతం బ్యాంకులకు కట్టేందుకు తాను సిద్ధమని చెబుతూ, మాల్యా ఓ ట్వీట్ చేశారు. పాత బకాయిల వసూలుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల నేపథ్యంలో మాల్యా ఈ ట్వీట్ చేశారు. కాగా, భారత బ్యాంకులకు మాల్యా సుమారు రూ. 9 వేల కోట్లను చెల్లించాల్సి వుంది. ఈ డబ్బులను కట్టకుండా లండన్ పారిపోయిన ఆయన్ను, ఎలాగైనా ఇండియాకు తిరిగి రప్పించేందుకు బ్రిటన్ కోర్టుల్లో భారత్ తరఫున సీబీఐ, ఈడీ న్యాయ పోరాటం చేస్తున్నాయి. 
Go Back to Shorts
Vijay malya
India
Britain
Loan
CBI
ED

More Telugu News