ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి తీరును తప్పుపట్టిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్!

04-08-2019 Sun 14:00 | Andhra
  • ఎవరైనా విలువలతో కూడిన రాజకీయం చేయాలి
  • రాజ్యాంగాన్ని కాపాడాల్సినవారే అనైతికను ప్రోత్సహిస్తున్నారు
  • వెంకయ్యనాయుడు చేసింది ముమ్మాటికి తప్పే
దేశంలో స్పీకర్ వ్యవస్థ సంక్లిష్ట దశలో ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ తెలిపారు. ఎవరైనా సరే విలువలతో కూడిన రాజకీయం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో టీడీపీ గొంతు నొక్కే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన సందర్భంగా రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ వెంకటేశ్ బీజేపీలో చేరితే వెంకయ్య నాయుడు ఆమోదించడం తప్పని తమ్మినేని సీతారామ్ అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినవారే అనైతికతను ప్రోత్సహించడం సరికాదన్నారు. తానెప్పుడూ ఫిరాయింపుల్ని ప్రోత్సహించబోనని స్పష్టం చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా ఉందని, మీడియా క్రియాశీలక పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఒక వ్యవస్థలో మరో వ్యవస్థ జోక్యం చేసుకోకూడదని రాజ్యాంగం చెబుతోందని,  స్పీకర్ కు విచక్షణ అధికారాలు ఉంటాయని తమ్మినేని అన్నారు.

శాసన సభలో 3 ఛానళ్లపై నిషేధం విధించడాన్ని తాను సమర్ధించానని చెప్పారు.  ‘శాసనసభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ నుంచి లైవ్ లు ఇవ్వకూడదని నిబంధన ఉంది. భవిష్యత్తులో పునరావృతం కాకూడదనే తాత్కాలిక నిషేధం విధించాం. దీనిపై ఛానళ్ల యాజమాన్యాలు ఇచ్చిన వివరణను పరిశీలిస్తున్నాం. వీలైనంత త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటాం’ అని తమ్మినేని పేర్కొన్నారు.
Andhra PradeshTelugudesamBJPassemblytammineni sitaramVenkaiah Naidu

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more