మౌనంగా ఉండండి.. పుకార్లను నమ్మొద్దు: జమ్ముకశ్మీర్ గవర్నర్

03-08-2019 Sat 10:44 | National
  • అమర్ నాథ్ యాత్రికులను వెనక్కి పిలిపిస్తున్న కేంద్రం
  • కశ్మీర్ కు భారీగా చేరుకుంటున్న సాయుధబలగాలు
  • కశ్మీర్ లోయలో తీవ్ర ఉద్రిక్తత
అందరూ మౌనంగా, ప్రశాంతంగా ఉండాలని, పుకార్లను నమ్మొద్దని జమ్ముకశ్మీర్ రాజకీయ నేతలకు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ సూచించారు. ఉగ్రదాడులు జరగనున్నాయనే అంచనాలతో అమర్ నాథ్ యాత్రికులను వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కశ్మీర్ లోయలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ క్రమంలో, వివిధ పార్టీలకు చెందిన నేతలను గవర్నర్ తన వద్దకు పిలిపించుకున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా వారికి చెప్పారు. గవర్నర్ ను కలిసిన వారిలో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, షా ఫైసల్, సజ్జాద్ లోనీ, ఇమ్రాన్ అన్సారీ తదితరులు ఉన్నారు.

ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి స్పష్టమైన సమాచారం ఉందని ఈ సందర్భంగా సత్యపాల్ మాలిక్ తెలిపారు. అయితే, ఉగ్రవాదుల అంశాన్ని ఇతర అంశాలతో ముడిపెడుతూ పుకార్లను ప్రచారం చేస్తూ, భయాందోళనలకు గురి చేస్తున్నారని చెప్పారు. మరోవైపు, జమ్ముకశ్మీర్ ప్రజలకు అక్కడి ఉద్యోగాలు, భూమిపై ప్రత్యేక హక్కులను కల్పిస్తున్న 'ఆర్టికల్ 35 A'ను కేంద్రం రద్దు చేయబోతోందని... అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా వేలాది సాయుధ బలగాలను లోయలోకి పంపుతోందనే ఆందోళన అక్కడి నేతలు, ప్రజల్లో నెలకొంది.

నిన్న మీడియాతో మెహమూబా ముఫ్తీ మాట్లాడుతూ, రాజ్యాంగం తమకు కల్పించిన ప్రత్యేక హక్కులను హరించేందుకు కేంద్రం యత్నిస్తోందని మండిపడ్డారు. తమకు మిగిలిన కొద్దిపాటి గుర్తింపును కూడా దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jammu And KashmirSatya Pal MalikArticle 35AMehbooba Mufti

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more