ఒక్క చలాన్ కూడా లేని వాహనాలకు సినిమా టికెట్లు, గులాబీలు ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు... వీడియో ఇదిగో!

  • హైదరాబాద్ లో వాహనదారులకు అవగాహన
  • స్వయంగా నిబంధనలు వివరించిన అంజనీ కుమార్
  • వైరల్ అవుతున్న వీడియో
అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడిపించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో, హైదరాబాద్ పోలీసులు వినూత్న అవగాహనా ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా, వాహనాలను తనిఖీలు చేస్తున్న సమయంలో, వారు అన్ని నిబంధనలూ పాటిస్తున్నారని, అన్ని రకాల వాహన పత్రాలున్నాయని తెలిస్తే, వారికి సినిమా టికెట్లను, గులాబీ పువ్వులను ఇచ్చి అభినందిస్తున్నారు.

అందుకు సంబంధించిన వీడియోను హైదరాబాద్ సిటీ పోలీసులు తమ అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో పంచుకున్నారు. ఇందులో ట్రాఫిక్ రూల్స్ గురించి వాహనదారుడికి హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్వయంగా వెల్లడిస్తూ కనిపిస్తున్నారు. అదిప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని మీరూ చూడండి.
Go Back to Shorts
Hyderabad
Police
Traphic
Anjani kumar

More Telugu News