వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను కుమారుడికి 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు
- కారును ఆపిన కానిస్టేబుల్‌పై ఎమ్మెల్యే కుమారుడి వీరంగం
- ట్రాఫిక్ సీఐని కాలితో తన్నిన సామినేని ప్రసాద్
- అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
సామినేని ప్రసాద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి ఆయనను 12వ ఏఎంఎం కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. ప్రసాద్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.