చీకట్లో చంద్రయాన్-2ను చూసి గ్రహశకలం దూసుకొస్తోందని భయపడిన ఆస్ట్రేలియన్లు!
- సోమవారం చంద్రయాన్-2ను ప్రయోగించిన భారత్
- ఆస్ట్రేలియా గగనతలంపై చీకట్లను చీల్చుతూ వెళ్లిన రాకెట్
- ఉదయం పేపర్లలో చూసి చంద్రయాన్-2 అని తెలుసుకున్న ఆస్ట్రేలియా ప్రజలు
చీకటి కారణంగా రాకెట్ మిగతా భాగం కనిపించకపోవడం, బూస్టర్ల నుంచి వెలువడుతున్న జ్వాలలు భీకరంగా ఉండడంతో ఆస్ట్రేలియా వాసులు రకరకాల ఊహాగానాలు చేశారు. గ్రహాంతరవాసుల నౌక అని, గ్రహశకలం అని పుకార్లు పుట్టించారు. చివరికి అది భారత్ ప్రయోగించిన చంద్రయాన్-2 అని ఉదయం దినపత్రికల్లో చూసిందాకా వారికి తెలియలేదు.