ఇక పూర్తిస్థాయి రాజకీయాల్లోకి: సినీనటి హేమ
- సినీ పరిశ్రమను విడిచి బాహ్య ప్రపంచంలోకి వస్తున్నా
- రాజమండ్రిలో కొత్త ఇల్లు కట్టుకుంటున్నా
- జగన్పై హేమ ప్రశంసలు
గతంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ తరఫున పోటీచేసిన హేమ ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పార్టీలో చేరినా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాలేదు. తాజాగా, సినీ పరిశ్రమకు దూరంగా పూర్తిగా రాజకీయాలకే అంకితం కావాలనుకుంటున్నట్టు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.