'సూపర్-30' ఆనంద్ కుమార్‌ను కలసిన పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా
- స్వయంగా కలిసి ప్రశంసలు
- విద్యార్థులకు మీ సేవలు అమూల్యమంటూ కితాబు
- ఆర్థిక సాయం చేస్తానంటే తిరస్కరించిన గణిత మేధావి
‘ఆనంద్‌కుమార్ చేస్తున్న కృషిని చూసి ఆయనను అభినందించడానికి వెళ్లాను. నా వంతుగా ఆయనకు ఆర్థిక సాయం చేద్దామని భావించాను. కానీ ఆశ్చర్యం. నా సాయాన్ని ఆయన మర్యాదపూర్వకంగా తిరస్కరించారు. తన సూపర్-30 కార్యక్రమాన్ని తన సొంత నిధులతో చేపట్టాలనుకుంటున్నట్టు వినమ్రంగా తెలిపారు. ఆయన కృషిని అభినందిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై ఆనంద్‌కుమార్ స్పందిస్తూ 'మీ అభినందనలే నాకు ఎంతో బలాన్నిస్తాయి. మీ అభిమానానికి ధన్యవాదాలు సార్’ అంటూ రీ ట్వీట్ చేశారు.