పాకిస్థాన్ క్రికెట్ జట్టే గొప్పదట... కొత్త వితండవాదాన్ని తెరపైకి తెచ్చిన పాక్ ఫ్యాన్స్!
- ఇండియాను ఓడించిన న్యూజిలాండ్, ఇంగ్లండ్
- ఆ రెండు జట్ల మధ్య పోటీ
- తాము ఫైనలిస్టులనే ఓడించామంటున్న పాక్
ఇక ఈ టోర్నీలో అన్నింటికన్నా బలమైన జట్టు తమదేనని పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఓ సరికొత్త వాదాన్ని తెరపైకి తెచ్చారు. అదేంటో తెలుసా? ఫైనల్ ఆడుతున్న రెండు జట్లనూ పాకిస్థాన్ లీగ్ దశలో మట్టి కరిపించిందట. ఫైనలిస్టుల చేతిలో ఇండియా ఓడిందని, ఆ రెండింటినీ తాము ఓడించాం కాబట్టి, తమదే గొప్ప జట్టని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఓడిపోయినా ఈ విధంగా సమర్థించుకోవడం ఒక్క పాక్ కే చెల్లిందని సెటైర్ల మీద సెటైర్లు వస్తున్నాయి.