ఇళ్ల కొనుగోలుదారులకు రక్షణగా నిలబడండి: కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
- జేపీ ఇన్ ఫ్రా కస్టమర్ల పిటిషన్ పై విచారణ
- లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారన్న ధర్మాసనం
- కేంద్రం చొరవచూపి, నూతన విధానం తేవాలని సూచన
నిర్మాణ రంగ సంస్థలు అనుకున్న సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేయని కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, డబ్బు కట్టి కూడా వారి సొంతింటి కల నెరవేరడం లేదని ఈ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. "సమస్యను పరిష్కరించేందుకు మీరు చొరవచూపాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి మేము సలహాలు కోరుతున్నాం. ఇటువంటి అన్ని కేసుల్లోనూ ఒకే విధానం ఉండాలి" అని ఈ సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. నిర్మాణ సంస్థ దివాలా తీసినట్టు ప్రకటించినా, గృహ కొనుగోలుదారులకు అన్యాయం జరుగకుండా నిబంధనలు ఉండాలని ధర్మాసనం సూచించింది.