గోమాత ఫుట్ బాల్ నైపుణ్యం... వీడియో మీరూ చూడండి!
- మహారాష్ట్రలో విడ్డూరం
- ఫుట్ బాల్ బంతి వద్దకు ఎవరినీ రానివ్వని ఆవు
- బంతి ఎటువెళితే అటు పరుగులు పెట్టిన గోమాత
ఓ ప్రొఫెషనల్ ఫుట్ బాలర్ తరహాలో ఆ గోమాత బంతిని తన అత్యధిక సమయం తన అధీనంలో ఉంచుకున్న వైనం నిజంగా విస్మయం కలిగిస్తోంది. ముంబయి సమీపంలోని ఓ మైదానంలో కొందరు కుర్రాళ్లు ఫుట్ బాల్ ఆడుతుండగా, ఎంటరైన గోవు బంతిని తన కాళ్లతో తన్నుతూ, ఎవరినీ దగ్గరకు రానివ్వకుండా హల్ చల్ చేసింది. ఆటగాళ్లు బంతి కోసం వెళితే ఆవు కోపంగా కాలు దువ్వుతూ బంతిని తంతూ నానా హంగామా చేసింది. బంతి ఎటువెళితే అటు పరుగులు తీస్తూ తాను కూడా ఆటలో లీనమైపోయినంతగా బిల్డప్ ఇచ్చింది.