ఆరు వారాల సెలవుల తర్వాత నేడు తెరుచుకున్న సుప్రీంకోర్టు
- మే 13 నుంచి నిన్నటి వరకు వేసవి సెలవులు
- 31 మంది జడ్జిలతో నేటి నుంచి పని చేయనున్న సుప్రీంకోర్టు
- పలు కీలక కేసులను విచారించనున్న సుప్రీం
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై కూడా నేడు సుప్రీం విచారించనుంది. ఈ అంశానికి సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసే అవకాశం ఉంది. కొత్త రోస్టర్ సిస్టం ప్రకారం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, ఎన్వీ రమణ, అరుణ మిశ్రా, జస్టిస్ నారీమన్ లు విచారించనున్నారు.