హరిరామ జోగయ్యకు అస్వస్థత.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన పవన్ కల్యాణ్!
- హైదరాబాద్ లోని ఏఐజీలో హరిరామజోగయ్యకు చికిత్స
- ఆరోగ్యం గురించి వాకబు చేసిన జనసేనాని
- వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థన
ఆయన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. 2004-09 సమయంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న హరిరామజోగయ్య తమ కుటుంబం కోసం రాజీనామా చేసి వచ్చారని పవన్ గుర్తుచేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.