ఇంగ్లండా? ఇండియానా?... నాసర్ హుస్సేన్ ప్రశ్నకు ముక్తకంఠంతో ఒకే సమాధానం చెప్పిన పాకిస్థానీలు!
- ట్విట్టర్ వేదికగా ప్రశ్న
- ఇండియాకే మద్దతంటున్న పాక్ వాసులు
- ఆక్రమణదారులకు మద్దతివ్వబోమని వ్యాఖ్యలు
ఇండియా తమ పొరుగు దేశమని, ఇంగ్లండ్ ఆక్రమణదారని గుర్తు చేసిన క్రికెట్ ఫ్యాన్స్, తాము ఇండియావైపే నిలుస్తామని తేల్చి చెప్పారు. పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్, ప్రీ కాంబ్రియన్, సియాసత్ వంటి న్యూస్ సంస్థలు కూడా నాసిర్ ట్వీట్ కు రిప్లయ్ ఇస్తూ, ఇండియాకు మద్దతు పలుకుతామని చెప్పడం గమనార్హం. ఇక కెవిన్ పీటర్ సన్ వంటి క్రికెటర్లు, నీవు ఎవరికి మద్దతిస్తున్నావని ఎదురు ప్రశ్నించారు. కాగా, ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే, పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సులభమవుతాయి. ఇంగ్లండ్ గెలిస్తే, పాక్ అవకాశాలు క్లిష్టమవుతాయి.