టీడీపీ నేత మురళీమోహన్ కు షాక్.. విశాఖలో ‘జయభేరీ షోరూమ్’ ను కూల్చేసిన అధికారులు!
- గంటా, పీలా గోవింద్ అక్రమ కట్టడాలు గుర్తింపు
- వాటిని కూడా కూల్చేయనున్న అధికారులు
- అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం
అలాగే జోన్-1 పరిధిలోని భీమిలిలో టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన క్యాంపు కార్యాలయాన్ని కూడా అనుమతి, ప్లానింగ్ లేకుండా అక్రమంగా నిర్మించారని అధికారులు గుర్తించారు. దీంతో పాటు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కు చెందిన భవనం ప్లానింగ్ కు విరుద్ధంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ రెండు బిల్డింగులను మరికాసేపట్లో అధికారులు కూల్చేయనున్నారు.