విజయనిర్మల మృతిపై స్పందించిన నందమూరి బాలకృష్ణ!
- గతరాత్రి కన్నుమూసిన విజయనిర్మల
- ఎంతో బాధాకరమన్న బాలకృష్ణ
- ఎంతో మంది మహిళలకు ఆదర్శమని వ్యాఖ్య
బాలనటి నుంచి హీరోయిన్ గా కూడా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. నాన్నగారితో 'మారిన మనిషి', 'పెత్తందార్లు', 'నిండు దంపతులు', 'విచిత్ర కుటుంబం' సినిమాల్లో నటించారు. అలాగే దర్శకురాలిగా 44 చిత్రాలను డైరెక్ట్ చేయడం చాలా గొప్ప విషయం. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్రసీమకు తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను" అని బాలకృష్ణ తన సంతాపాన్ని వెలిబుచ్చారు.