ఆ చట్టాన్ని ఓసారి చదవండి యనమల గారూ.. ఎవరు తుగ్లకో మీకే తెలుస్తుంది!: విజయసాయిరెడ్డి కౌంటర్
- నదీతీరాన్ని పూడ్చి నిర్మాణాలు చేపట్టారు
- ఇప్పుడు కాపాడాలని అడ్డుపడటం వింతగా ఉంది
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
నదీ పరిరక్షణ చట్టాన్ని యనమల ఓసారి చదవాలనీ, అప్పుడు ఎవరు తుగ్లకో తెలుస్తుందని విజయసాయిరెడ్డి సూచించారు. ‘రివర్ కన్జర్వేషన్ యాక్టును ఒకసారి చదవండి యనమల గారూ. ఎవరు తుగ్లకో తెలుస్తుంది. నదీ తీరాన్ని పూడ్చి కట్టిన నిర్మాణాలను తొలగించాలని డిమాండు చేయాల్సిందిపోయి కాపాడాలని అడ్డుపడటం వింతగా ఉంది. ప్రకృతి వనరులను ధ్వంసం చేసినందుకే కదా ప్రజలు మీకు వాతలు పెట్టి తరిమేశారు’ అని విమర్శించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.