‘ప్రత్యేక హోదా’ ఏం పాపం చేసిందని చంద్రబాబు వదిలేశారు?: సీఎం జగన్
- ‘హోదా’ గురించి చంద్రబాబు పట్టించుకోలేదు
- నీతి ఆయోగ్ ఏర్పడ్డ తర్వాత బాబు స్పందించారు
- బాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి
ఏపీకి ‘ప్రత్యేక హోదా’ హామీ అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్ ను చంద్రబాబు అడిగారా? అని జగన్ ప్రశ్నించారు. ‘హోదా’ హామీ అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్ కు కనీసం ఓ లేఖ కూడా చంద్రబాబు రాయలేదని విమర్శించారు. ఏపీకి ముంపు మండలాలు ఇవ్వకపోతే సీఎంగా ప్రమాణస్వీకారం కూడా చేయనని చెబుతున్న చంద్రబాబు, ‘ప్రత్యేక హోదా’ ఏం పాపం చేసిందని దాని కోసం పోరాడకుండా వదిలేశారని ప్రశ్నించారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారని, ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.