మహేశ్ బాబు మంచి మనసుకు ఇదో నిదర్శనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబు మంచి మనసుకు ఇదో నిదర్శనం

  • హీరోగా విపరీతమైన క్రేజ్ 
  • సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసిన మహేశ్
  • 1000 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్  
మహేశ్ బాబు మంచి నటుడు అనే విషయం తెలిసిందే. 'బుర్రిపాలెం' గ్రామాన్ని దత్తత చేసుకుని ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆయన తన మంచి మనసును చాటుకున్నాడు. అంతేకాదు 1000 మంది చిన్నారులకు తన సొంత ఖర్చుతో గుండె ఆపరేషన్లు చేయించి, మానవత్వానికి మరో రూపంగా నిలిచాడు.

 నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారులు గుండె సంబంధింత జబ్బుతో బాధపడుతుంటే, తన దృష్టికి వచ్చిన వారికి తన ఖర్చుతో మహేశ్ బాబు ఆపరేషన్లు చేయిస్తూ వస్తున్నాడట. అలా మూడేళ్లుగా ఆయన 1000 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించినట్టుగా నమ్రత తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఆంధ్ర హాస్పిటల్స్ .. ఇంగ్లాండ్ కి చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసినట్టుగా ఆమె పేర్కొన్నారు. మొత్తానికి దాత్రుత్వంలో మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' అని పించుకుంటున్నాడు. 
Mahesh Babu

More Telugu News