ఆ జర్నలిస్ట్ ఓ తల్లికే పుట్టి ఉంటాడు.. ఇప్పుడు నన్ను బాధపెడుతున్నాడు!: రేణుదేశాయ్

  • ఉత్తరాదిన పిల్లలతో రేణుదేశాయ్ టూర్
  • పవన్ పిల్లలతో మాజీ భార్య అని టైటిల్ పెట్టిన వెబ్ సైట్
  • ఆగ్రహం వ్యక్తం చేసిన రేణుదేశాయ్
ప్రముఖ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈరోజు మీడియా వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. రేణుదేశాయ్ ఇటీవల తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీనగర్, జమ్మూ సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ వార్తను ఓ వైబ్ సైట్ కవర్ చేసింది.  ఆ వార్తలో ‘పవన్ కల్యాణ్ పిల్లలతో ఆయన మాజీ భార్య రేణుదేశాయ్’ అని టైటిల్ పెట్టాడు.

దీనిపై రేణుదేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడే ఎవరో నాకు ఇది పంపించారు. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఓ తల్లికే పుట్టి ఉంటాడు. ఒక తల్లిని ఎలా బాధ పెడుతున్నాడు ఇప్పుడు?’ అని రేణుదేశాయ్ ఫేస్ బుక్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
renu desai
Tollywood
Pawan Kalyan

More Telugu News