హీరోయిన్ గా మారుతోన్న హీరో చెల్లెలు
Add ap7am to your home Screen

హీరోయిన్ గా మారుతోన్న హీరో చెల్లెలు

  • హీరోగా జీవీ ప్రకాశ్ కుమార్ కి క్రేజ్ 
  • విజయ్ సేతుపతి జోడీగా భవానీశ్రీ 
  • షూటింగు దశలో సినిమా  
వెండితెరపై హీరోలుగా వెలుగొందుతోన్న వారిలో అన్నదమ్ములు వున్నారు. హీరోయిన్లుగా హవాను కొనసాగిస్తోన్న వారిలో అక్కా చెల్లెళ్లు వున్నారు. అందుకు భిన్నంగా హీరోల జాబితాలో అన్న .. హీరోయిన్ల జాబితాలో చెల్లెలు కనిపించనున్నారు.

తమిళంలోని యువ కథానాయకులలో జీవీ ప్రకాశ్ కుమార్ స్థానం ప్రత్యేకం. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన సినిమాలు చేస్తూ ఆయన మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆయన చెల్లెలు భవానిశ్రీ హీరోయిన్ గా వెండితెరకి పరిచయం కానుంది. దర్శకుడు విరుమాండి తమిళంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారు. మరో కథానాయికగా భవానీశ్రీని ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం సెట్స్ పై వున్న ఈ సినిమాను, తెలుగులోను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. 
bhavani sri
vijay sethupathi

More Telugu News